జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08457230000ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. బుధవారం రాత్రి జిల్లా అధికారులు, ఆర్డీవోలతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో, వాగులు, వంకల్లో వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోందని, నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని ఆమె తెలిపారు.