చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

2చూసినవారు
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మహిళలలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిన గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయాలను విద్యార్థినులు స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్