సిద్దిపేట మండలంలోని మోకిడి ఫంక్షన్ హాల్ లో బుధవారం సిద్దిపేట జిల్లా మున్నూరు కాపు పటేల్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల సాయిరాం పాల్గొన్నారు. కొండ దేవయ్య సంఘం సభ్యుల కోసం అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు. బాల సాయిరాం, సిద్దిపేట జిల్లా మున్నూరు కాపు సంఘ భవనానికి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో రెండు ఎకరాల భూమి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.