రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

1565చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో జాతీయ ప్రధాన రహదారి 365/B పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వాహనం టీవీఎస్ ఎక్సెల్‌ పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరగడంతో మృతదేహం గుర్తించలేనంతగా చిదికిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని చేర్యాల మార్చురీకి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్