సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలో ఊర చెరువు కట్టను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వి రోడ్డు నిర్మించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న కట్ట మరింత దెబ్బతిని, భారీ వర్షాల సమయంలో తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, కట్టను బలోపేతం చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.