సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నాలుగు రోజుల్లో వార్డు సభలు పక్కాగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వార్డు, బూత్ లెవల్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 4 నుంచి 12 వరకు కార్యక్రమాలను వివరించారు. ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో ఆయా వార్డుల్లో సభలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ ప్రేరణ, మేనేజర్ శ్రీనివాస్, టీపీఓ ప్రవీణ్, రెవెన్యూ ఆఫీసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.