గత సంవత్సరం కంటే ఈసారి పదో తరగతి
ఫలితాలు మెరుగ్గా సాధించామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులతో, విద్యార్థులతో, ఉపాధ్యాయులతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని, అందుకు తాను ఉత్తరాలు రాయడం, స్పెషల్ క్లాసుల్లో స్నాక్స్ ఏర్పాటు చేయడం, పుస్తకాలు పంపించడం వంటివి చేశానని గుర్తు చేశారు. ఈసారి
ఫలితాలు మెరుగుపడటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.