సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం జాతీయ మానవ హక్కుల కమిటీ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా నియమితులైన సభ్యులను పరిచయం చేశారు. జిల్లా అధ్యక్షులు నెమలి సుభాష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కార్తీక్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుడిసె ప్రభు రాజ్ మాట్లాడుతూ, ప్రజలకు న్యాయం అందించడమే తమ ముఖ్య లక్ష్యమని, ప్రతి సామాన్య పౌరుడి హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.