జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 4 సంవత్సరాల బాలుడిని విజయనగరం జిల్లా దంపతులకు, 6 నెలల శిశువును నిజామాబాద్ జిల్లా దంపతులకు కలెక్టర్ హైమావతి అధికారికంగా దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దత్తత తీసుకున్న పిల్లలను బాగా చదివించాలని, వారి ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలని, వారి భవిష్యత్ నిర్మాణానికి పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. పిల్లలు లేని దంపతులు సిద్దిపేట శిశుగృహ, బాలల పరిరక్షణ విభాగం ద్వారా దత్తత కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.