సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో, వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. 22 మండలాల్లో సుమారు 2,976 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులో దిగుమతి చేసుకున్నట్లు, తడిసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. నేటికీ 427 కొనుగోలు కేంద్రాల ద్వారా 58,455 మంది రైతుల నుండి 3,14,868 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 457 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.