ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. మంగళవారం సిద్దిపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 26న పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుందని, ఈ సందర్భంగా ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.