జాతీయ, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం

0చూసినవారు
జాతీయ, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోం
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తాడూరి రవీందర్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సాంకేతిక సమస్యలతో హాజరు నమోదు చేయకపోవడం, పని దినాలు పెంచకపోవడం వంటి ఇబ్బందులతో కూలీలను పథకానికి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే నెల 10న కొమురవెల్లి మండల కేంద్రంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా మూడవ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you