
ముగ్గురు ప్రతినిధులను నియమించిన కాక్రోచ్ జనతా పార్టీ
ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) విద్యావ్యవస్థలోని వైఫల్యాలను ప్రశ్నించేందుకు ఉద్యమిస్తోంది. ఈ మేరకు ముగ్గురు ప్రతినిధులను ప్రకటించింది. వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ప్రకారం, ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ ముఖ్య ప్రతినిధిగా, రాజకీయ పరిశోధకుడు విజేత దహియా, మాజీ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ అశుతోష్ రాంకా పార్టీ తరపున ప్రజలతో సంభాషిస్తారు. దాస్ న్యాయ, చట్ట, సామాజిక అంశాలపై, రాంకా పర్యావరణ, విద్య, యువత సంబంధిత అంశాలపై దృష్టి సారిస్తారు. భారత్‌లో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడమే సీజేపీ లక్ష్యం.




