కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు హామీ ఇచ్చిన రూ. 2500ను వెంటనే అందించాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు పుల్లూరు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేటలో జరిగిన బీఎస్పీ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన ఈ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా దాని ఊసే లేదని విమర్శించారు.