సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. 'మేము పొడుగు ఉంటే ఏంది.. పొట్టిగా ఉంటే ఏంది రేవంత్ రెడ్డి. మా పనులు పొడుగు ఉన్నాయి కానీ నీ బుద్ధి, ఆలోచనలు పొట్టిగా ఉన్నాయి, నువ్వు పొట్టిగా ఉన్నావు' అని హరీష్ రావు ఆదివారం వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఎత్తుపల్లాలను ప్రశ్నించడం అనవసరమని, ఆయన ఆలోచనలు, బుద్ధి మాత్రం పొట్టిగా ఉన్నాయని విమర్శించారు. ఏం చేశావో చెప్పకుండా మమ్మల్ని తిడితే ఏం వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.