సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాల్లో విద్యార్థులు పాముకాట్లకు గురవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురైన ఘటనపై ఆయన మంగళవారం ఎక్స్‌లో స్పందించారు. ఇది రేవంత్ పరిపాలనా వైఫల్యమని, హార్వర్డ్‌లో సీఎం కాస్ట్ లీ చదువులు చదువుతుంటే, ఇక్కడ గురుకుల విద్యార్థులు ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.