
భార్యను గొంతు పిసికి చంపి.. చెట్టుకు వేలాడదీసిన భర్త
బీహార్‌లోని బగహాలో ఓ దారుణం చోటుచేసుకుంది. భర్త గౌతమ్ కాజీ తన భార్య హేమలత కుమారిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మామిడి చెట్టుకు వేలాడదీశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భర్త గౌతమ్‌ను నిందితుడిగా గుర్తించారు. దీంతో శనివారం గౌతమ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఫోరెన్సిక్ ఆధారాలు ఆత్మహత్య కాదని అనుమానం రేకెత్తించడంతో విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. వాగ్వాదం తర్వాత భార్యను గొంతు నులిమి చంపి, ఆపై శవాన్ని చెట్టుకు వేలాడదీసినట్లు తెలిపాడు.




