సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని మర్పడగ గ్రామంలో అమీద్ధిపురం రమేష్ (30) అనే యువకుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తల్లికి బట్టలు ఉతకడానికి అన్న మహేష్, వదిన కరుణతో కలిసి ఊర చెరువు వద్దకు వెళ్లిన రమేష్, అన్న హెచ్చరించినా వినకుండా లోతుగా ఉన్న నీటిలోకి దిగడంతో మునిగిపోయాడు. గ్రామస్తుల సమాచారం మేరకు రెస్క్యూ టీం రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికితీసింది. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.