సిద్దిపేట: యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దు

72చూసినవారు
సిద్దిపేట: యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దు
యువత తాత్కాలిక ఆనందం కొరకు జీవితాలు నాశనం చేసుకోవద్దని టూ టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. శనివారం సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో నార్కటిక్స్ డాగ్స్ తో అనుమానాస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి ఇతర మత్తు పదార్థాలు మరియు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్