న్యూ ఇయర్ వేళ యువకుడి అనుమానాస్పద మృతి

గురువారం శివంపేట మండల కేంద్రంలో తుడుం అరవింద్ (22) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లి తిరిగి వచ్చేసరికి అరవింద్ విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
