విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి

0చూసినవారు
విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి
జహీరాబాద్ మండలంలోని ఒంటెల్ గడ్డ తండాలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ తీగల మరమ్మతులు చేస్తుండగా, అసిస్టెంట్ లైన్ మెన్ హరీష్‌ విద్యుత్ షాక్‌కు గురై దుర్మరణం చెందారు. ఆయన స్వగ్రామమైన న్యాల్కల్‌లో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యుత్ శాఖాధికారులు, తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే హరీష్ మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్