మంగళవారం జహీరాబాద్ శివారులోని పస్తాపూర్ లో మహబూబ్ (32) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్మశాన వాటిక చివర్లో కట్టెలతో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు జరా సంఘం మండలం గంగాపూర్ కు చెందినవాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.