జ్వరం, జలుబు, తలనొప్పి వస్తే చాలా మంది వెంటనే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అయితే తరచూ ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం ఆరోగ్యానికి డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కాలేయం, కిడ్నీలపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కళ్లు తిరగడం, వాంతులు, అధిక చెమట, చర్మ సమస్యలు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వైద్యుల సలహాతో రోజుకు రెండు మాత్రమే తీసుకోవాలని పేర్కొంటున్నారు.