సీఎం రేవంత్‍పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు

2620చూసినవారు
సీఎం రేవంత్‍పై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
TG: సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో 54 మంది కార్మికులు సజీవదహనమైన ఘటనను తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో చీకటి రోజని మాజీ మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. ఈ ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం, యాజమాన్య నిర్లక్ష్యం వల్లే అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. సీఎం ఘటన స్థలానికి వెంటనే వెళ్లలేదని, రూ.1 కోటి పరిహారం ప్రకటించి రూ.1 లక్ష మాత్రమే ఇచ్చారన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్స్యూరెన్స్, వైద్య ఖర్చులను పరిహారంలో చేర్చి మోసం చేశారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్