ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన మనాలీలో సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. శీతాకాలం నేపథ్యంలో అక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలిని అనుభూతి చెందేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో మనాలీకి తరలి వెళుతున్నారు. ఢిల్లీ వంటి మహానగరాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణంలో కాలుష్యం అత్యంత తక్కువగా ఉండటంతోనే మనాలీకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు పలువురు టూరిస్టులు చెబుతున్నారు.