అమెరికాలో 33 ఏళ్లుగా అక్రమంగా నివసిస్తున్న 73 ఏళ్ల సిక్కు మహిళ హర్జిత్ కౌర్‌ను కాలిఫోర్నియా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించి, బలవంతంగా ఢిల్లీకి పంపారు. ఆమె ఆశ్రయం కోసం చేసిన అభ్యర్థనను అమెరికా తిరస్కరించింది. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో నివసిస్తూ, ఒక బట్టల దుకాణంలో పనిచేసిన హర్జిత్ కౌర్ సెప్టెంబర్ 8న ఇమ్మిగ్రేషన్ తనిఖీలో అధికారులకు పట్టుబడ్డారు. తనను క్రూరంగా గెంటివేశారని, బంధువులకు వీడ్కోలు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.