ప్రధాని నరేంద్ర మోడీ సిక్కింను ప్రకృతి, సంస్కృతి కలగలిసిన ప్రాంతంగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా జన ఔషధీ స్టోర్స్ ఏర్పాటు చేశామని, ఆర్థిక ప్రగతి వేగంగా పరుగులు పెడుతోందని తెలిపారు. క్లీన్ ఎనర్జీపై ప్రపంచం దృష్టి సారించిందని, సిక్కిం ఆర్గానిక్ స్టేట్‌గా రూపాంతరం చెందిందని, అక్కడి ఆర్గానిక్ ఉత్పత్తులు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, ఆర్గానిక్ సాగు దేశానికి ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.