
15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ
సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అద్భుత సెంచరీతో చెలరేగిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత దేశవాళీ టోర్నీలో బరిలోకి దిగనున్న కోహ్లీ, ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు సమాచారం అందించాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కూడా దీనిని ధృవీకరించింది. ఫిట్ నెస్, మ్యాచ్ ప్రాక్టీస్ కోసం దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచన మేరకు కోహ్లీ అంగీకరించాడు. చివరిసారిగా 2010 ఫిబ్రవరిలో ఢిల్లీ తరుఫున ఆడాడు.




