బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 పెరిగి రూ.1,12,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.170 పెరిగి రూ.1,23,170 పలుకుతోంది. వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.2,000 పెరగడంతో రూ.1,68,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.