
పాక్లో 30 మంది టీటీపీ టెర్రరిస్టుల ఎన్కౌంటర్
పాకిస్తాన్లోని ఒరక్జాయ్ జిల్లాలో జరిగిన రివేంజ్ ఆపరేషన్లో 30 మంది తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) టెర్రరిస్టులను హతమార్చినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 7న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఒరక్జాయ్ జిల్లాలో జరిగిన ఘర్షణలో 11 మంది పాక్ సైనికులు మరణించారు వారిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ కూడా ఉన్నారు. వారి మరణానికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆర్మీ తెలిపింది.




