ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కేసీపీ కమాండర్ హావోబిజామ్ దిలీప్ సింగ్‌ అరెస్టు
May 28, 2026, 03:05 IST/

కేసీపీ కమాండర్ హావోబిజామ్ దిలీప్ సింగ్‌ అరెస్టు

May 28, 2026, 03:05 IST
మణిపూర్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ కాంగ్లేపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కేసీపీ) కీలక కమాండర్ హావోబిజామ్ దిలీప్ సింగ్‌ను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు రహస్య సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన అతన్ని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, మణిపూర్ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా పట్టుకున్నాయి. దిలీప్ సింగ్‌పై 12కు పైగా UAPA కేసులు నమోదయ్యాయి. ఇటీవల మణిపూర్‌లోని కాక్చింగ్ ప్రాంతంలో అతని సమాచారం ఆధారంగా పోలీసులు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.