ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 'సిందూర్' పార్ట్ 2.. పాక్ తీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాక్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.