తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. పాఠశాలల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ ఆదేశించింది. తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఒంటిపూట బడి అమలు చేయనున్నారు. ఈ ఒంటిపూట బడులు నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి.