మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్!

2666చూసినవారు
మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్!
తెలంగాణలో సినిమా థియేటర్ల వ్యవస్థలో మార్పులు కోరుతూ ఎగ్జిబిటర్లు మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చారు. రెంటల్ విధానంతో నష్టపోతున్నామని, దాని స్థానంలో పర్సంటేజీ విధానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లలో అమలవుతున్న పర్సంటేజీ విధానాన్ని సింగిల్ స్క్రీన్లలోనూ అమలు చేయాలని, సినిమా విడుదలైన 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదని, టికెట్ ధరల నియంత్రణ, విద్యుత్ ఛార్జీలపై సబ్సిడీ, పన్నుల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఏప్రిల్ 30లోగా స్పష్టమైన నిర్ణయం రాకపోతే, మే 1 నుంచి తెలంగాణలోని సుమారు 450కి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్