ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)పై ఎన్నికల కమిషన్‌లోని ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఈసీపై, 'సర్' నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో అధికారులు స్పష్టత ఇచ్చారు. ఎన్నికల కమిషనర్లు పలు అంశాలను లేవనెత్తినప్పటికీ.. కీలక నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నట్లు వెల్లడించారు.