సర్ ఎన్యూమరేషన్ గడువు పెంచాలని కోరిన పీసీసీ

5038చూసినవారు
సర్ ఎన్యూమరేషన్ గడువు పెంచాలని కోరిన పీసీసీ
‘సర్’ ఎన్యూమరేషన్ గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డికి పీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. శనివారం సీఈవోను కలిసి వినతిపత్రం అందించారు. 2025 ఓటరు జాబితాలోని ప్రతి ఓటరుకు బీఎల్‌‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉండటంతో పంపిణీలో జాప్యం జరుగుతోందని, ఆశా వర్కర్లు పల్స్ పోలియో విధుల్లో ఉండటం కూడా ఆలస్యానికి కారణమని వివరించారు. పలు నియోజకవర్గాల్లో బీఎల్‌‌ఓలకు ఓటర్ల జాబితాలు అందలేదని తెలిపారు. సీఈవో సుదర్శన్ రెడ్డి గడువు పెంపు అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని, జాప్యంపై జిల్లా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్