
లగ్జరీ సదుపాయాలతో.. అదిరిపోయిన నవీ ముంబయి ఎయిర్‌పోర్టు (వీడియో)
ముంబయి ఎయిర్‌పోర్ట్‌పై భారం తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. 1160 హెక్టార్లలో విస్తరించి, రెండు 3700 మీటర్ల రన్వేలు కలిగిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో లోటస్ ఆకారంలో, భవిష్యత్తు తరాలకు అనుగుణమైన టెర్మినల్ ఉంది. ప్రారంభంలో ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణికులకు, పూర్తి స్థాయిలో 9 కోట్ల మందికి సేవలందించగల సామర్థ్యం ఉంటుంది. ప్రత్యేక లాంజ్‌లు, పిల్లల జోన్లు, డిజిటల్ తెరలు, హోటల్ వంటి సదుపాయాలు ఉన్నాయి.




