
వేములవాడ
ముప్పై నెలలవుతుంది వేములవాడ బ్రిడ్జి పూర్తి కాలేదు
BRS పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్మి నరసింహారావు ఆదివారం మాట్లాడుతూ, వేములవాడ బ్రిడ్జి నిర్మాణం 30 నెలలుగా పూర్తి కాలేదని ఆరోపించారు. BRS హయాంలో రెండో బ్రిడ్జి పూర్తి చేశామని, మూడో బ్రిడ్జి పనులు 40% పూర్తయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా బ్రిడ్జి పూర్తి కాకపోవడంపై ఆయన ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.



































