చొప్పదండి - Chopadandi

వీడియోలు


కరీంనగర్ జిల్లా
కాంగ్రెస్ గెలిస్తే ఇళ్లపైకి బుల్డోజర్ వస్తుంది: కేటీఆర్
Nov 04, 2025, 16:11 IST/

కాంగ్రెస్ గెలిస్తే ఇళ్లపైకి బుల్డోజర్ వస్తుంది: కేటీఆర్

Nov 04, 2025, 16:11 IST
జూబ్లీహిల్స్ ఎన్నికలు కారు, బుల్డోజర్ మధ్యేనని, కాంగ్రెస్ గెలిస్తే ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్ వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమాజీగూడలో మంగళవారం రోడ్‌షో నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, పెన్షనర్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గరీబోళ్ల ఇళ్లు కూల్చుతున్నారని, మహిళలకు ఉచిత బస్సులు ఇస్తూ పురుషులకు ఛార్జీలు పెంచారని ఆరోపించారు. కారు గుర్తుకు ఓటు వేసి సునీతా గోపినాథ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.