
బుగ్గారం: బాల్య వివాహాలపై అవగాహన
బుగ్గారం మండలంలోని గంగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ రాయిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారిక కోఆర్డినేటర్ కొండయ్య, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ బాల్య వివాహాల నిరోధక చట్టం-2006 గురించి వివరించారు. 18 ఏళ్లలోపు అమ్మాయిలకు, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు వివాహం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా పడుతుందని హెచ్చరించారు.



































