జగిత్యాల: తల్లి కొడుకులను ఢీకొన్నకారు.. ఒకరు మృతి

1200చూసినవారు
జగిత్యాల: తల్లి కొడుకులను ఢీకొన్నకారు.. ఒకరు మృతి
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తల్లి కొడుకులను కారు ఢీకొన్న ఘటనలో తల్లి లక్ష్మి (55) మృతి చెందగా, ఆమె కుమారుడు ఫిరోజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మంతెన రమేష్ నడిపిన కారు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ లక్ష్మి మరణించారు. ఫిరోజ్ ను కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్