బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి లైంగిక దాడి!

350చూసినవారు
బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి లైంగిక దాడి!
జగిత్యాల జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై సమీపంలో నివసిస్తున్న బేర తిరుపతి(38) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి అని తెలియడంతో, ఈ నెల 17న కరీంనగర్‌లోని మాతాశిశు ఆసుపత్రిలో ప్రసవించింది. ఆసుపత్రి వర్గాల అనుమానంతో పోలీసులు, చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మామిడితోట వద్దకు తీసుకెళ్లి అశ్లీల వీడియోలు చూపిస్తూ లైంగికదాడికి పాల్పడ్డాడని, బెదిరించినట్లు బాలిక తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్