జగిత్యాల: చీపురుతో విద్యార్థులను చితకబాదిన వ్యక్తి (వీడియో)

501చూసినవారు
జగిత్యాల ఎస్టీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. కూరగాయలు కోసే ఉద్యోగి శ్రీనివాస్ పడుకున్న విద్యార్థులను చీపురుతో చితకబాదిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులోనే రోజూ విధులకు హాజరవుతూ గత నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వార్డెన్ పలుమార్లు హెచ్చరించినా మారని నేపథ్యంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఘటనపై విచారణ జరిపి, శ్రీనివాస్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్