జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నుంచి కథలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నైతిక, మానవ విలువలతో కూడిన కథలను ఒక పేజీకి మించకుండా తెలుగు లేదా ఇంగ్లీష్‌లో రాసి మార్చి 15లోపు డీఈవో కార్యాలయానికి పంపాలని సూచించారు. ప్రతి పాఠశాల నుంచి కథలు పంపాలని, ఎంపికైన కథలను ఏప్రిల్‌లో పుస్తకంగా ప్రచురిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 8985348424ను సంప్రదించవచ్చని తెలిపారు.