జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక లేగ దూడ మృతి చెందింది. ఈ ఘటనతో స్పందించిన స్థానిక విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గోమాతకు హిందూ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. గోమాతలకు హిందూ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉందని, సకల దేవతల నిలయంగా భావిస్తామని, మానవతా దృక్పథంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు జరిపినట్లు వారు తెలిపారు.