మల్యాల: ఆటో డీసీఎం వాహనం ఢీకొని ఆరుగురు మహిళలకు గాయాలు

1356చూసినవారు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం వీఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద శనివారం ఆటో, డీసీఎం వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.