ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈత సరదా విషాదంగా మారుతోంది. LMD, మానేరు జలాశయాల్లో రెండేళ్లలో 21 మంది, SRSP కెనాల్లో మరో 11 మంది నీట మునిగి మృతి చెందారు. లేక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో లోయర్ మానేరు డ్యాం వద్ద ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. వేసవిలో చెరువులు, వాగుల్లో పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.