తొల‌గించిన జాబ్ కార్డుల‌పై విజిలెన్స్ అధికారుల విచార‌ణ!

445చూసినవారు
తొల‌గించిన జాబ్ కార్డుల‌పై విజిలెన్స్ అధికారుల విచార‌ణ!
కథలాపూర్ మండలంలో ఇటీవల తొలగించిన 52 జాబ్ కార్డ్స్ పై విచారణ మంగళవారం జరిగింది. మండల అధికారి ఫిర్యాదు మేరకు విజిలెన్స్, జిల్లా అసిస్టెంట్ మేనేజర్ బృందం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించింది. అనంతరం బాధితుల ఇళ్లకు వెళ్లి విచారించగా, గత ఏడాదిగా పనులకు వెళ్లని వారి జాబ్ కార్డ్స్ ను తొలగించారని, అయితే వారి పేర్లపై డిమాండ్ ఎవరు తీసుకున్నారనేది అంతుచిక్కని విషయమని బాధితులు తెలిపారు. ఈ విషయాలు విని అధికారులు విస్మయానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్