కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామానికి చెందిన శనిగరపు సంపత్ (38) తన భార్య మౌనికతో కలిసి చిగురు మామిడికి వెళ్లి తిరిగి వస్తుండగా, కేశవపట్నం చర్చ్ సమీపంలో ఓ కుక్క అడ్డు రావడంతో వారి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.