కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన

1143చూసినవారు
కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని పాఠశాలలో విద్యార్థులు మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన ఘటన కలకలం రేపింది. విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయగా మద్యం సీసాలు బయటపడ్డాయి. పాఠశాల సమీపంలోని బెల్ట్ షాపు నుండి మద్యం కొన్నట్లు విద్యార్థులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్కూల్ సమీపంలోని బెల్టు షాపులను ఎత్తివేయాలని, మద్యం దుకాణాల సమయాలను నియంత్రించాలని అధికారులను కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్